హోలీ పాటతో దుమ్మురేపిన నటి ఆమ్రపాలి దుబే
పండుగలు, ప్రత్యేక సందర్బాన్ని పురస్కరించుకుని పాటల్ని అందించే నటి ఆమ్రపాలి తాజాగా హోలీ సాంగ్ 2020తో మీ ముందుకొచ్చింది. ఈ హోలీ పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.
భోజ్‌పురి సంచలనం, నటి ఆమ్రపాలి దుబే లేటెస్ట్ (Holi 2020 song) హోలీ పాట వైరల్ అవుతోంది. ఈ ఏడాది హోలీ పండుగను పురస్కరించుకుని ముందుగానే పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఆమ్రపాలి సింగర్ కూడా కావడం ఆమెకు ప్లస్ పాయింట్. పెద్ద పండుగలు, వేడుకల సమయంలో ఆమె తరచుగా ఆల్బమ్స్, సాంగ్స్ సింగిల్స్‌ను తన అభిమానులకు అందిస్తుందని తెలిసిందే. ఈ క్రమంలో రంగుల పండుగ హోలీ కోసం చేసిన పాట వివరాలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్ చేసుకున్నారు.
Also Read; ఆ హీరోయిన్ వచ్చిన వేళా విశేషం.. నితిన్‌కు పెళ్లి!
తాజాగా 'హోలియా మీ లాగే బాడి దార్' అంటూ ఆమ్రపాలి దుబే సందడి చేసిన హోలీ పాటను రెండ్రోజుల కిందట యూట్యూబ్‌లో విడుదల చేయగా విశేష స్పందన లభించింది. 'హోలియా మీ లాగే బాడి దార్' పాటలో ఆమ్రపాలి నటించారు. సాంప్రదాయ తెలుపు లెహెంగా-చోలి మరియు రంగురంగుల పింక్ దుప్పట్టా ధరించిన ఆమ్రపాలి చాలా అందంగా కనిపిస్తుంది.
కాగా, హోలీ పాట వివరాలను అభిమానులతో పంచుకుంటున్న నటి ఆమ్రపాలి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సాహిత్యాన్ని పవన్ పాండే సాహిత్యం అందించిన ఈ హోలీ పాటకు ఆజాద్ సింగ్ సంగీతం సమకూర్చారు. రాశారు. 'హోలియా మీ లాగే బాడి దార్' పాటకు సింగర్ ఖుష్బూ జైన్ గాత్రం అందించారు. అవిగ్న ఈ హోలీ 2020 పాటను తీసుకొచ్చారు. ఈ ఏడాది మార్చి 10న హోలీ పండుగను జరుపుకుంటారు.
Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్
See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా